True Love
TRUE LOVE

ఒకానోనా సమయంలో ఒక ధనవంతుడైన నగల వ్యాపారి ఉండేవాడు. అతనికి నలుగురు భార్యలు.ఆ వ్యాపారికి తన నాల్గవ భార్య అంటే అందరికంటే కూడా  ఎక్కువ ఇష్టం ఉండేది తాను  చాలా అందంగా ఉండేది.  తాను స్వయంగా తయారు చేసిన విలువైన ఆభరణాలని తనకి అలంకరించేవాడు. చాలా విలువైన బట్టలను ఇచ్చేవాడు. తాను ఎక్కడికైనా ప్రయాణించాల్సి వస్తే నాల్గవ భార్యని తీసుకెళ్లి అందరికి గర్వంగా  చూపించుకునేవాడు దానితో ఆమెకి  తాను చాలా అందగత్తె అని గర్వం పెరిగింది.

 నాల్గవ భార్య తరువాత  అందంగా ఉండేది తన మూడవ భార్య. తరువాత మూడవ భార్యని  కూడా  ప్రేమించేవాడు. ఈమె కూడా అందంగా ఉండేది. ఆమెకి కావలసినవన్నీ కొని పెట్టేవాడు. ఆమెకి  వివిధ రకాలైన ఆహరాన్ని తింటూ ఎంజాయ్ చేయడం చాల ఇష్టం .  నగల వ్యాపారి వివిధ ప్రాంతాలలో పెరిగే రకరకాల పండ్లను ఆమె కోసం తెప్పించేవాడు.

ఆ ఇద్దరి భార్యలంతా అందంగా ఉండకపోయినా రెండవ భార్య బాగుండేది. చాలా తెలివైనది కూడా. ఆ వ్యాపారికి వ్యాపారంలో ఎలాంటి అవకతవకలు అయినా నష్టం వచ్చిన తన రెండవ భార్య దగ్గరికి  వెళ్లి సలహాలు తీసుకునేవాడు. తాను ఇంకా ఏ ఇతర వ్యాపారం మొదలు పెట్టిన రెండవ భార్యకు అప్పచెప్పేవాడు.  దానితో ఆమెకి నేను చాల తెలివైన దానిని నావల్లే నా  భర్త మంచి స్థాయిలో ఉన్నాడు. నా తెలివితో నేను ఎంతైనా సంపాదించగలనని గర్వంగా  ఉండేది.

ఇక మొదటి భార్య ఆమె అంత అందంగా ఉండదు కానీ మంచి మనసు, అణకువ ఎదుటి వారిని అర్ధం చేసుకోవడంలో ఆమె తర్వాతే ఎవరైనా. గుణంలో ఆమెని మించిన వారు ఇంకొకరు లేరు కానీ ఆ వ్యాపారి ఎప్పుడైతే వేరే వారిని వివాహం చేసుకున్నాడో అప్పటి  నుండి మొదటి భార్యని పట్టించుకోవడం మానేసాడు. మంచి బట్టలు ఇచ్చేవాడు కాదు, భోజనం కూడా పెట్టేవారు కాదు. తనని ఎక్కడికి తీసుకువెళ్ళేవాడు కాదు. ఆమె ఆ వ్యాపారి ప్రేమ కోసం చాలా తపించేది. కానీ, ఆ వ్యాపారి అసలు ఆమెని పట్టించుకోలేదు. ఎప్పుడైనా కనబడిన తనకు కనబడొద్దని కోప్పడేవాడు.

కొన్ని సంవత్సరాల తరువాత ఆ వ్యాపారికి కోలుకోలేని జబ్బు ఒకటి వచ్చింది. ఎక్కడెక్కడి నుండో వైద్యులు వచ్చి చూసారు కానీ ఏమి చెప్పలేక పోయారు. చివరికి ఒక వైద్యుడు, వ్యాపారి ఒక నెలకి మించి బ్రతకడని చెప్పేసాడు.  

అప్పటి నుండి ఆ వ్యాపారిని ఏ భార్య కూడా సరిగా చూడలేదు. ఆ జబ్బు ఎక్కడ తమకు వస్తుందనే భయంతో వ్యాపారి దగ్గరికి వెళ్లడమే మానేసారు. ఒకరోజు ఆ వ్యాపారి తనలో తానే ఏడ్చేసాడు నా  జీవితం మొత్తంలో నా భార్యలను నేను చాల ప్రేమించాను కానీ ఇపుడు నా  దగ్గరికి ఎవరు రావట్లే అని అనుకున్నాడు.

ఒకరోజు తన నాల్గవ భార్యని పిలిచి నేను నిన్ను ఎంతగా ప్రేమించ్చానో ఆరాధించానో నీకు తెలుసు నేను చనిపోయేంతవరకు నాతో ఉంటావా అని అడిగాడు, దానికి ఆమె నిరాకరించి నేను ఇంత అందగత్తెని నీతో ఉండలేను. నేను ఇపుడే వెళ్లి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని హాయిగా ఉంటానని చెప్పింది దానితో ఆ వ్యాపారి బాధపడ్డాడు.

తరువాత తన మూడవ భార్యని పిలిచాడు తాను కూడా నేను నీతో ఉండలేను. నువ్వు జబ్బు పడ్డప్పటి నుండి నాకు ఇష్టమైన ఆహరం దొరకట్లేదు. నేను ఇపుడే నా  పుట్టింటికి వెళ్ళిపోతా  అని చెప్పింది.

తరువాత రెండవ భార్యని పిలిచాడు తాను కూడా నేను ఇంత తెలివి గల దాని నీతో ఉంది నేను ఏంచేయగలను. నా  దగ్గర ఉన్న డబ్బుతో మరొక వ్యాపారం మొదలు పెట్టి డబ్బు సంపాదిస్తాను. కానీ, నువ్వు బ్రతికున్నంత కాలం నిన్ను వచ్చి కలుస్తాను అని చెప్పింది. దానితో వ్యాపారి ఇంకా కృంగిపోయాడు. తనకి వచ్చిన జబ్బు కంటే ఈ మాటలే ఎక్కువ బాధపెట్టాయి.

అంతలో ఒకామె తన గదిలోకి వచ్చి నేను మీ ముందుకు రావొచ్చా? అని అడిగింది.  దానితో ఆ వ్యాపారి ఎవరు అని అడిగాడి తాను నేను మీ మొదటి భార్యనండి  అని చెప్పింది. కనీసం ఆ వ్యాపారి మొదటి భార్యని గుర్తుపట్టలేకపోయాడు. తాను చాల సన్నగా చినిగిన బట్టలు వెస్కొని ఉంది. వ్యాపారి రమ్మని పిలిచాడు. ఆమె ఏడుస్తూ ఇపుడైనా మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వండి మీతో పాటే ఉంటాను చావులో కూడా మీకు తోడుగా వస్తాను అని చెప్పింది ఆ మాటతో ఆ వ్యాపారి కళ్ళుతెరుచుకున్నాడు. ఇంతకాలం తనను పట్టించుకోనందుకు బాధపడ్డాడు.

నీతి | Moral : మన జీవితంలో కూడా ఎవరికి , వేటికి  విలువ ఇవ్వాలో తెలియయకుండా ఉంటాము. ఈ కథలో వ్యాపారి నాల్గవ భార్య మన శరీరం లాంటిది దానిని ఎక్కువగా ప్రేమించి బాగా అలంకరిస్తాము కానీ చివరికి మన మనసుతో తోడుగా ఉండలేదు. మూడవ భార్య మన భోజనం లాంటిది ఎప్పటికి పరిమితం కాలేదు. రెండవ భార్య తెలివి మన చివరి సమయంలో ఉపయోగ పడదు. మొదటి భార్య మనస్సు, నమ్మకం, స్వేచ్ఛ ,ఆలోచన, ఆనందం చివరి క్షణాల్లో తోడుగా ఉండేవి . కావున గుర్తుపెట్టుకోండి ఎవరిని తక్కువ చేయకూడదు. ఎవరి విలువ వారికే.

9 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *