ఒకానొకప్పుడు ఒక అడవిలో నాలుగు ఆవులు జీవించేవి మరియు చాలా మంచి స్నేహితులు. ప్రతిరోజు అవి ఒక ప్రదేశంలో కలుసుకునేవి.
ఒకసారి అటుగా వచ్చిన ఒక సింహం వాటిని చూసింది,తినాలని అనుకుని వాటిపైన దాడి చేసింది కానీ ఆవులు నాలుగు కలిసి దానితో పోరాడి అక్కడి నుండి తరిమేసాయి.
కానీ సింహం రోజు వాటిని చూస్తూ ఎలాగైనా తినాలని అనుకుంది. ఆవులు నాలుగు “కలిసి ఉంటె నేను దాడి చేయలేకపోతున్నాను కావున వాటిని ఎలాగైనా విడగొట్టాలి” అనుకుంది.
ఒకరోజు నాలుగు ఆవులలో ఒక ఆవు వారు రోజు కలుసుకునే ప్రదేశానికి ముందుగా వచ్చింది. అది చూసిన సింహం దాని దగ్గరికి వెళ్లి తన ఫ్రెండ్స్ గురించి చాలా తప్పుడు మాటలు చెప్పింది.
మిగతా ఆవులు వచ్చాక ఒకరినొకరు పోట్లాడుకుని మళ్లి కలుసుకోవద్దని అక్కడి నుండి వెళ్లిపోయారు.
మరునాటి నుండి ఆవులు కలుసుకోలేదు. ఇదే సరైన సమయం అని భావించిన సింహం విడిగా ఉన్న ఆవుల్ని ఒకదాని తరువాత ఒకరిని చంపి తినేసింది..
నీతి | Moral : కలిసి ఉంటె ఏమిచేయలేని శత్రువులు మనం విడిపోయేలా చేసి మనల్ని నాశనం చేస్తాయి. కావున, ఎలాంటి చిన్న గొడవలు వచ్చిన కలిసి ఉండాలి కానీ విడిపోవద్దు. అందుకే అన్నారు పెద్దలు ” ఐక్యతే బలం”.
❤️
<3