ఒక పల్లెటూరిలో రాణి , రాజు అనే ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకే స్కూల్ లో ఒకే క్లాస్ లో చదువుకునే వాళ్ళు మరియు మంచి ఫ్రెండ్స్ కూడా!. వాళ్ళ టీచర్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు వాళ్ళని మరియు వాళ్ళ స్నేహాన్ని పొగుడుతూ ఉండేవాళ్ళు.
రాజు కి మంచి పాలరాయిలను సేకరించే అలవాటు ఉంది. ఒకరోజు రాజు, రాణి ఆడుకుంటున్నారు. రాణి తాను తినడానికి కొన్ని స్వీట్స్ తెచ్చుకుంది అవి చూసిన రాజు, రాణి నాకు నీ దగ్గర ఉన్న స్వీట్స్ అన్ని ఇవ్వు నేను నా దగ్గర ఉన్నపాలరాయిలు అన్ని ఇచ్చేస్తాను అని చెప్పాడు. దానికి రాణి సరే అని తన దగ్గర ఉన్న అన్ని స్వీట్స్ ని ఇచ్చేసింది ఒక్కటి కూడా ఉంచుకోకుండా… కానీ రాజు మాత్రం తన దగ్గర ఉన్న పాలరాయిలలో మంచివి తీస్కొని మిగతావి రాణి కి ఇచ్చాడు.
ఆ రోజు రాత్రి రాజు కి అసలు నిద్ర పట్టలేదు,రాజు దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు “రాణి నాకు అన్ని స్వీట్స్ ఇచ్చిందా లేకపోతే నాలాగే తాను కూడా కొన్ని దాచిపెట్టుకుందా అని “.
నిజానికి రాణి ది స్వచ్ఛమైన ప్రేమ( స్నేహం) అందుకే తాను ఏమి దాచుకోకుండా రాజు అడిగిన వెంటనే మరుక్షణం ఆలోచించకుండా తన ప్రాణ స్నేహితుడికి స్వీట్స్ అన్ని ఇచ్చేసింది రోజు రాత్రి హాయిగా నిద్రపోతుంది.
కానీ, రాజు ది నిజమైన ప్రేమ(స్నేహం) కాదు అందుకే చెప్పిన మాటని కాదని తన స్నేహితురాలికి అన్ని రాళ్ళని ఇవ్వకుండా కొన్ని దాచుకున్నాడు..
స్వఛ్చమైన స్నేహం ఉన్న రాణి కి ఎలాంటి అనుమానం రాలేదు కానీ, రాజు కి మాత్రం అనుమానం వచ్చి సందేహంతో నిద్ర కూడా పోలేదు.
నీతి | Moral : మీరు ఏ సంబంధంలో అయినా 100 శాతం నిజాయితీ ఇవ్వకపోతే, అవతలి వ్యక్తి ఆమెకు / అతని వంద శాతం ఇచ్చాడా అని మీరు ఎప్పుడూ సందేహిస్తూనే ఉంటారు. ప్రేమ, ఉద్యోగి – యజమాని, స్నేహం, కుటుంబం, దేశాలు మొదలైన ఏదైనా సంబంధానికి ఇది వర్తిస్తుంది…