ఒక వేసవి కాలం ఒక కాకి చాలా దాహంతో ఉంది. అది నీటిని వెతుకుతూ వెతుకుతూ పొలాలు చెరువులు అన్ని తిరగసాగింది. కానీ ఎండలు బాగా ఉండడంతో చెరువులు అన్ని ఎండిపోయాయి, పొలంలో కూడా నీరు దొరకలేదు. కాకి చాలా నీరసించిపోయింది, దాదాపు “ఈ వేసవిలో నీరు దొరకడం కష్టమని ఆశలు వదులుకుంది”
ఆలా ఎగురుకుంటూ చాలా దూరం పోయింది. అకస్మాత్తుగా దానికి ఒక కుండ కనబడింది. అది నేరుగా కుండ దగ్గరికి వెళ్లి కుండలో నీరు ఉందా ? లేదా! అని చూసింది. “కుండ అడుగు బాగాన కొంత నీరు ఉంది”.
అది చూసిన కాకి సంతోషంతో నీరు త్రాగడానికి ప్రయత్నించింది. కానీ “కుండ అడుగు బాగాన నీరు ఉన్నందున” కాకి నీటిని అందుకోలేకపోయింది”.
నీరు కన్పించగానే ఎంతో సంతోషపడింది. కానీ త్రాగడానికి అందకపోవడంతో “అటు ఇటు చూస్తూ బాగా ఆలోచించింది. కాకికి ” గులక రాళ్లు కనబడ్డాయి”. కాకికి మంచి ఆలోచన వచ్చింది వెంటనే ” గులక రాళ్ళని ఒక్కొక్కటి తీసుకొని వచ్చి కుండలో వేసింది అలా కొన్ని వేసేసరికి కుండ అడుగు బాగాన ఉన్న నీళ్లు కాస్త పైనకి వచ్చాయి. కాకి సంతోషంహ నీటిని త్రాగింది.
The story is supper
Thanks Ramarao! Keep reading and sharing.