The Ant and The Dove
The Ant and The Dove

బాగా ఎండాకాలంలో ఒక చీమ చాలా  దాహంతో ఉంది. అది చాలా దూరం నడుస్తూ  నీటి కోసం వెతకడం ప్రారంభించింది. ఆలా చాలా దూరం నడిచేసరికి వర్షాకాలం వచ్చేసింది.

ఆలా చాల దూరం నడిచాక చీమ అక్కడే ఉన్న ఒక చెట్టుని ఎక్కింది దానికి పట్టు తప్పి పక్కనే ఉన్న సరస్సులో పడిపోయింది. చీమకి ఈత రాకపోవడంతో గట్టిగ కాపాడండి అంటూ అరవసాగింది.

అదంతా గమనిస్తున్న ఒక పావురం చెట్టు మీద నుండి ఒక ఆకు తెంపి ఆ చీమకు దగ్గరగా వేసింది. అప్పుడు చీమ ఆ ఆకు మీదకి ఎక్కి ఒడ్డుకు చేరుకుంది మనసులో పావురానికి కృతజ్ఞత చెప్పుకుంది.

ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వేటగాడు పావురం వైపుగా విల్లు ఎక్కుపెట్టాడు.  ఇది గమనించిన చీమ వెంటనే ఆ వేటగాన్ని కుట్టింది  వేటగాడి దృష్టిని మలిచింది.  అంతలో, ఆ పావురం తప్పించుకుంది. ఆ పావురం మనసులో చీమకి కృతజ్ఞత చెప్పుకుంది.

నీతి | Moral : “మనం ఏదైనా మంచి పని చేస్తే అది మనకు తప్పకుండ ఎదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. కాబట్టి అందరు అందరికి మంచిని చేయడానికి ప్రయత్నించండి”.

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *