ఒకప్పుడు, ఒక జంతు ప్రదర్శనశాల వారు అడవి నుండి ఒక పులిని బంధించి తీసుకొచ్చారు. అది బలంగా మరియు మంచి రంగుతో ఉన్న పులి. దానిని ప్రతీ రోజు ప్రదర్శనకు ఉంచేవారు. ఆ ప్రదర్శన శాలలో అన్ని జంతువుల కన్నా ఆ పులి అందరిని బాగా ఆకట్టుకునేది. ఆ పులిని చూడటానికి ప్రత్యేకమైన ఛార్జ్ తీస్కొని మరీ అనుమతిచ్చేవారు. ఆ పులి కారణంగా ఆ జంతుప్రదర్శనశాలకి మంచి పేరొచ్చింది. అందరు సందర్శించడం మొదలుపెట్టారు. ఆ కారణంగా కొన్ని రోజులలోనే ఆ ఓనర్ చాలా ధనవంతుడయ్యాడు.
కొంతకాలం గడిచాక… పులి బక్కచిక్కి పోవడం మరియు తన మంచి రంగుని కోల్పోతూ వచ్చింది. అది చూసిన ఓనర్ చాలా కంగారుపడ్డాడు. ఇదేంటి ఈ పులి ప్రదర్శన వలన ఇన్ని రోజులు మంచి సంపాదనతో ఉన్నాను. ఇపుడేమో ఇది ఇలా తయారయ్యింది. అని దానికి రోజూ మంచి భోజనం పెట్టించాడు. అయినా కూడా పులి తన రంగుని పూర్తిగా కోల్పోయింది.
సాధారణంగా పులుల రంగు పసుపు మరియు నలుపు రంగు కలయికలో ఉంటుంది. కానీ, ఈ పులి యొక్క రంగు బూడిదరంగు, నలుపు మరియు తెలుపు రంగులోకి మారింది. .. ఎంతగా అంటే, ఆ పులిని పాతకాలపు బ్లాక్ అండ్ వైట్ సినిమా నుండి తీస్కొచ్చినట్టుగా కనిపించింది.
జంతుప్రదర్శనశాల ఓనర్ .., ప్రపంచంలోని గొప్ప చిత్రకారులని ఆ జంతుప్రదర్శనశాలకు వచ్చి రంగులేని పులిని మొదట్లో ఎలా ఉండేదో అలా మార్చమని చెప్పాడు. అలా మారిస్తే మంచి బహుమానం ఇస్తానని చెప్పాడు. చిత్రకారులు పులికి కొంత రంగు వేయడానికి ప్రయత్నించారు. కానీ, అందులో ఎవరూ విజయవంతం కాలేదు, ఎందుకంటే రంగు వేయడానికి ప్రయత్నించినపుడల్లా పులి చర్మం నుండి ఆ రంగు జారుతూ ఉండేది.
అప్పుడు “వాన్ కాగ్” చిత్రకారుడు వచ్చాడు. అతను ఒక వింత వ్యక్తి, అతను తన బ్రష్‌తో సంతోషంగా గాలిలో పేయింటింగ్ చేస్తూ తనకు తానే గొప్ప పేయింటర్ గా అనుకుంటుండేవాడు.. అతను ఎపుడు కూడా పేయింటింగ్ వేయడానికి కలర్, పేపర్ ని ఉపయోగించలేదు.
అతనేదో ఊహిస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ గాలిలో పెయింటింగ్ వేస్తుంటాడు. అతను అక్కడికి వచ్చి పులికి రంగు నేను వేస్తాను అన్నాడు. అది విన్న మిగతా చిత్రకారులంతా పగలబడి నవ్వారు. ఉన్నత చిత్రకారులమైన మాతోనే పులికి రంగు వేయడం జరగలేదు. పిచ్చివాడివి, గాలిలో పెయింట్ వేసేవాడివి నీతో ఏం అవుతుంది..? అని వెక్కిరించారు.
అపుడు అతను ఓనర్ దగ్గరికి వెళ్లి.., నాకు కొన్ని రోజుల సమయం ఇవ్వండి. నేను తప్పకుండా పులి యొక్క రంగు మారుస్తాను. నాకు మీరు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు. అందుకు ఆ ఓనర్ సరే అన్నాడు. మిగతా చిత్రకారులంతా .., అసలు ఇతను పులికి ఎలా పూర్వ వైభవాన్ని తీసుకొస్తాడో..? మనము ఇక్కడే ఉండి చూద్దాము అని నిశ్చయించుకున్నారు.
వాగ్ కాన్ ఆ పులి దగ్గరికి వెళ్లి చెవిలో ఎదో చెప్తూ పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు. మధ్య మధ్యలో దానికి మంచి ఆహారాన్ని అందిస్తూ దాని చెవిలో ఎదో చెబుతూ పెయింటింగ్ వేస్తూనే ఉన్నాడు. అలా కొన్ని రోజులు గడిచాక పులి తన పూర్వపు బలము మరియు రంగులోకి మారింది. అది చూసిన అందరు చాలా ఆశ్చర్యపోయారు.
చిత్రకారుడు పులికి చెవిలో చెప్పిన రహస్యం ఏమిటో..? అని అందరూ తెలుసుకోవాలనుకున్నారు. అపుడు అతను తన బ్రష్ నిజ జీవితాన్ని చిత్రించడానికి మాత్రమే వాడతానని వారికి వివరించాడు, అలా చేయడానికి నాకు రంగులు అవసరం లేదు.
నేను పులికి చెవిలో చెప్పింది ఏంటంటే..! నువ్వు నీ పూర్వవైభవాన్ని కలిగి ఉంటే నిన్ను ఈ బోను నుండి విడిపిస్తాను. అపుడు నువ్వు స్వతంత్రంగా జీవించవచ్చు అన్నాను. అందుకోసం నేను పులికి కొన్ని రోజులు సమయం ఇచ్చాను. తన జీవితం మళ్లీ ఎలా ఉండబోతోంది అని ఊహించుకుని పులి బాగా తింటూ ఆనందంగా గడపడం మొదలుపెట్టింది . ఆ కారణంగా పులి తిరిగి తన వైభవాన్ని తెచ్చుకుంది అని వివరించాడు.
అందులో ఒక చిత్రకారుడు లేచి అసలు పులికి అలా చెప్తే ఫలితం వస్తుందని నీకెలా తెలుసు? అన్నాడు. అందుకు వాన్ కాగ్” అడవిలో ఉన్నపుడు పులి స్వేచ్ఛగా తనకు నచ్చినట్టుగా జీవించేది. కానీ, ఇపుడు తగిన ఆహారం దొరికినా కూడా, తిరగడానికి చోటు లేదు మరియు స్వతత్రంగా తిరిగే హక్కు లేదు. తోటి జంతులు లేరు అందుకనే పులి ఇలా తయారయ్యింది. అది గమనించిన నేను పులి చెవిలో తన భవిష్యత్తు గురించి చెప్పాను అందుకు ఫలితమే ఇది అన్నాడు.
అందరు లేచి చప్పట్లు కొట్టారు. ఇంతకాలం నిన్ను మేమంతా ఒక పిచ్చి చిత్రకారుడిలా భావించాము. కానీ నిజ జీవితాన్ని రంగుల మయం చేసే గొప్ప చిత్రకారుడివి నీవే అని ప్రసంశించారు.
👏👏👏
Thanks Abhilash garu! Keep reading and sharing. 🙂
Really Nice.. 👍 👏👏👏
Thank you! Keep reading and sharing.
Sure 👍 will share..
We would like read more moral stories.
👍
Nyc Akka👍
Thanks Teju! Keep reading and sharing. 🙂
A great story… Keep going 👍👏👏👏👏👏👏👏👏
Thank you so much:)